మిర్యాలగూడలో 18 గంజాయి కేసులు నమోదు

మిర్యాలగూడలో 18 గంజాయి కేసులు నమోదు

NLG: జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్‌లో భారీగా గంజాయి వాడకం కలకలం రేపుతుంది. డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లలో మొత్తం 18 గంజాయి కేసులు నమోదు కాగా, 95 మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 53 మంది వినియోగదారులు ఉండగా, 42 మంది విక్రయించే వారు ఉన్నారు. ఈ విక్రేతలలో అత్యధికంగా ఏపీ నుంచి 18 మంది, తెలంగాణ-17, బీహార్-4, ఒడిశా-22, UP-1గా ఉన్నారు.