అధిక ధరలపై ఫర్టిలైజర్స్ యజమానిపై కేసు నమోదు

అధిక ధరలపై ఫర్టిలైజర్స్ యజమానిపై కేసు నమోదు

NDL: కోడుమూరు మండలం బైన్ దొడ్డి గ్రామానికి చెందిన రైతు చిన్నవీరన్న ఫిర్యాదు మేరకు, శ్రీలక్ష్మీ ఫర్టిలైజర్ షాపు యజమాని పట్నం కృష్ణమూర్తిపై మంగళవారం కేసు నమోదు చేయబడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా ఎరువులను విక్రయించినట్లు ఎస్సై ఎర్రిస్వామి తెలిపారు. మోసం, అత్యవసర వస్తువుల చట్టం 1955 కింద దర్యాప్తు కొనసాగుతోందని ఎస్సై డి. ఎర్రిస్వామి అన్నారు.