VIDEO: నెల్లికుదురు నర్సరీలో భారీ కొండచిలువ.!
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ నర్సరీలో సుమారు పది అడుగుల పొడవైన భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. అయితే, కొందరు గ్రామస్థులు ధైర్యం చేసి దాన్ని చంపేశారు. గ్రామంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.