ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
NLG: చిట్యాల పురపాలిక కేంద్రంతో పాటు మండలంలోని పెద్ద కాపర్తి, ఆరేగూడెం, గుండ్రాంపల్లి, వెంబావి, నేరడ తదితర గ్రామాల్లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.