'నిబంధనలు పాటించకపోతే సీజ్ చేస్తాం'
ప్రకాశం: స్కూల్ బస్సు యజమానులు నియమ నిబంధనలు పాటించకపోతే వెహికల్ సీజ్ చేస్తామని మార్కాపురం మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు హెచ్చరించారు. సోమవారం కాలేజీ బస్సులను తనిఖీ చేశారు. 2 కాలేజీ బస్సులకు FDSS లేని కారణంగా వాటికి నోటీసులు జారీ చేశారు. బస్సులో ఫైర్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్, వెహికల్ ఇంజిన్‌కు FDSS తప్పనిసరిగా ఉండాలన్నారు.