సమస్య పరిష్కరించకపోతే నిహారదీక్ష చేస్తాం: సీపీఐ

KKD: పిఠాపురం 29వ వార్డులో డ్రైనేజ్ సమస్యతో వీధుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ నాయకులు చిన్న తెలిపారు. పెద్ద కాలువల స్థానంలో చిన్న కాలువలు నిర్మించడంతో తరచుగా ఏలేరు నీరు రోడ్డుపైకి వస్తోందని పేర్కొన్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేదంటే నిరహారదీక్ష చేస్తామని హెచ్చరించారు.