ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ
MBNR: ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు.