VIDEO: సంక్రాంతి వేళ ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ
సూర్యాపేట: సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు కలగకుండా పోలీసులు పక్కా వ్యూహం అమలు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా క్షేత్రస్థాయిలో వాహనాల మళ్లింపును పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ వెంకట్, ఎస్సైలు సాయి తేజ, సాయిరాం ఉన్నారు.