'యూనివర్సిటీలో మావోయిస్టు భావజాలం'
KNR: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తూ, విద్యార్థులను మావోయిస్టు భావజాలం వైపు ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిశోధక విద్యార్థి నైతం మహేశ్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ సుజాత, విద్యార్థి కరికే మహేష్‌పై గతంలోని అభియోగాలను పేర్కొంటూ, వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.