మురికి కాలువలు శుభ్రంతో రోగాలకు చెక్
SDPT: మురికి కాలువలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారానే దోమల వ్యాప్తిని, సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి అన్నారు. శనివారం రెడ్డి కాలనీలో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందితో తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. కాలువల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.