కంభం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

కంభం మండలంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

ప్రకాశం: అర్హత ఉండి అన్నదాత సుఖీభవ రాని వారు ఈనెల 20వ తేదీ లోపు రైతు సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి షేక్ మహమ్మద్ తెలిపారు. గురువారం మండలంలోని ఎల్.కోట, నడింపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు పాల్గొన్నారు.