పంచాయతీ కార్మికుల సమ్మె విరమణ
VZM: గజపతినగరం పురిటిపెంట పంచాయతీ కార్మికులు సోమవారం మధ్యాహ్నం నుండి సమ్మె విరమించినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి తెలిపారు. ఒక నెల జీతం ఈరోజు చెల్లించారని అలాగే మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించడం జరిగిందన్నారు. ఈ మేరకు సమ్మెకు సహకరించిన వారికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.