ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు
విమానాల రద్దుతో రైల్వే ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. చర్లపల్లి-యలహంక, చర్లపల్లి-షాలిమర్, HYD-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లు కేటాయించింది. రేపు రాత్రి 10 గం.లకు చర్లపల్లి నుంచి యలహంకకు బయలుదేరి, ఈ నెల 9న యలహంక నుంచి చర్లపల్లికి వస్తుంది. అలాగే రేపు రాత్రి 9:35 గం.లకు చర్లపల్లి నుంచి షాలిమర్ వెళ్లి ఈ నెల 10న తిరిగి రానుంది.