వింజమూరులో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం నాడు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని తప్పకుండా ఆరోగ్యం కోసం వ్యాయామల ఆటలు ఆడవలసిన అవసరం ఉందని తెలిపారు. అలాగే తన నియోజకవర్గంలో క్రీడాభివృద్ధి కోసం కొంత నగదును కేటాయిస్తానని ప్రకటించారు.