VIDEO: మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఎమ్మెల్యేకు వినతి
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య, పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కార్యదర్శి కలిసి ఎమ్మెల్యే నాగరాజును బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డ్‌లో అభివృద్ధి పనులు, లింక్ రోడ్లకు మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంలో పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.