VIDEO: 'బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు'
KNR: సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో గ్రామాలు వల్లకాడులుగా మారాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌లో ఎంపీ మాట్లాడుతూ.. బల్బులు పెట్టేవారు, కాలువలు శుభ్రం చేసేవారు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు.