నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
W.G: నరసాపురం సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ మధుకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాయపేట, మొగల్తూరు రోడ్డు, సబ్ కలెక్టర్ బంగ్లా, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, మూడు బొమ్మల సెంటర్, క్రిస్టియన్ పేట ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తామన్నారు. పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.