మురికి కాల్వల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్

మురికి కాల్వల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్

WNP: కాలనీవాసులు చెత్తా చెదారాన్ని, కొబ్బరి బోండాలు ఖాళీ బాటిళ్లు మురికి కాలువల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం వనపర్తిలోని మర్రి కుంటలో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కాలనీలోని ప్రధాన కాలువ మురుగు తొలగింపు పనులను ప్రారంభించారు.