బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
BHPL: కాటారం మండల కేంద్రానికి చెందిన BRS నాయకుల దళిత బంధం సాధన సమితి ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించగా, శుక్రవారం ఉదయం పోలీసులు వారిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఫ్రీజింగ్ లో ఉన్న అకౌంట్ ను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.