పోగొట్టుకున్న ఫోన్ అందజేత
VKB: తొరమామిడి గ్రామానికి చెందిన మాచపరి ప్రభాకర్ రెండు నెలల క్రితం ఫోన్ పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా దొరకక బట్వారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఫోన్‌ను గుర్తించారు. బంట్వారం SI విమల చేతుల మీదుగా శనివారం ప్రభాకర్‌కు ఫోన్ అందించారు. పోయిన ఫోన్ తిరిగి అందించిన పోలీసులకు ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపాడు.