అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సభ్యుల నియామకం

NLR: ఆత్మకూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సభ్యులుగా సంగం మండలం వుడ్ హౌస్ పేట గ్రామానికి చెందిన ఉక్కాల శ్రీనివాసులు నియామకమయ్యారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. సభ్యులుగా నియమించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.