వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, సర్పంచ్ ఎర్రల జానకి రాజు ప్రారంభించారు. కేంద్రంలో తాగునీరు, నీడవంటి వసతులు కల్పించినట్లు తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.