పానీపూరీ తిని ఆరుగురికి అస్వస్థత

పానీపూరీ తిని ఆరుగురికి అస్వస్థత

MNCL: బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో పానీపూరీ తిని ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. మేరుగు సంగీతాదేవి, అనుప్రియ, కాదాసి త్రిషిక, చిలివేరి అక్షయణి, వాషిత, పుల్లె శ్రీకాంత్ పానీపూరి తిని ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. అలాగే కడుపు నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికు తరలించారు.