VIDEO: అతివేగం, ఓవర్ టేక్ చేయడం వల్లే బస్సు బోల్తా
NZB: ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద స్థలాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. నిజామాబాద్ డీటీసీ దుర్గా ప్రమీల, డీటీవో ఉమామహేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును సమీక్షించారు.