గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడి మృతి

గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడి మృతి

జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు నిశాంత్ గుండెపోటుతో మృతిచెందాడు. ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అతడు సోమవారం అన్నదాన కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యలోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.