VIDEO: ఘోరం.. బాలుడి కన్ను పీకేసిన కుక్క
యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ముడేళ్ల బాలుడైన రియాన్ష్‌పై కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి కన్నును పీకేసాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని అసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలో ఇవాళ ఒక్కరోజే ముగ్గురిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.