VIDEO: పోగొట్టుకున్న నగలు అప్పగించిన పోలీసులు
MDK: తూప్రాన్‌లో వాహనంపై వెళ్తూ రూ. 16 లక్షల విలువైన 9 తులాల బంగారు ఆభరణాలు పోగొట్టుకోగా వాటిని గుర్తించి అప్పగించినట్లు డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. అల్లాపూర్‌కు చెందిన నర్సింలు దంపతులు ద్విచక్ర వాహనంపై దొంతికి వెళ్తూ మార్గమధ్యలో నగల బ్యాగు స్పీడ్ బ్రేకర్ వద్ద పడిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగును గుర్తించి వారికి అప్పగించారు.