అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభం

అగ్నిమాపక వారోత్సవాల  ప్రారంభం

అన్నమయ్య: రాయచోటిలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక కేంద్రంలో కమేమొరేషన్ పరేడ్ నిర్వహించి అమరులైన సిబ్బందికి నివాళులు అర్పించారు. అగ్ని ప్రమాదాల నివారణపై కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వివిధ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.