బెస్తవారిపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

బెస్తవారిపేటలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

ప్రకాశం: బేస్తవారిపేటలోని పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. సీఐ వాహనదారులకు హెల్మెట్ వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాల నివారణకు మూల మలుపుల వద్ద కన్వేక్స్ మిర్రర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.