తేనెటీగల దాడిలో ఐదుగురికి గాయాలు

ELR: తేనెటీగలు దాడి చేయడంతో ఐదుగురు గాయపడిన సంఘటన పోలవరంలో చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన మహేష్, రాజు, శాంతి, సతీష్, మరియమ్మ పోలవరం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పనుల కోసం రాగా.. వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణంరాజు తెలిపారు.