ఏప్రిల్ 13న రామాలయం రెండవ వార్షికోత్సవం
ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ రెండవ వార్షికోత్సవం ఏప్రిల్ 13 నుంచి జరగనుంది. ఈ విషయం ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. సీతారాముల కళ్యాణం మహోత్సవంతో పాటు అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.