తలకు దెబ్బ తగిలి విద్యార్థి మృతి
ASF: జైనూర్ మండలంలోని పానపటార్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం 4వ తరగతి చదువుతున్న విద్యార్థి దుర్వా అన్వేష్ మృతి చెందింది. ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్వేష్ ఊయలపై ఎక్కి ఊగుతుండగా, ఊయల నుంచి కిందపడి ఇనుప పెట్టెపై పడటంతో అతని తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.