బేతిగల్‌లో కొండచిలువ కలకలం
KNR: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో సోమవారం రాత్రి కొండచిలువ కలకలం సృష్టించింది. ఊర చెరువు కట్టపై మైసమ్మ గుడి సమీపంలో రోడ్డుపై కొండచిలువ కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జమ్మికుంటకు ప్రధాన మార్గం కావడంతో రాత్రి వేళ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు సూచించారు.