నాడు తండ్రి.. నేడు కుమారుడు!
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్‌లో విషాదం అలుముకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామానికి వస్తూ వరుస సోదరులు బుర్ర కళ్యాణ్ (27), బుర్ర నవీన్ (27) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పదేళ్ల క్రితం తండ్రి ఉప్పలయ్య ప్రమాదంలో మరణించగా అప్పట్లో ప్రాణాలతో బయటపడ్డ నవీన్ ఇప్పుడు మృత్యువాత పడటంతో గ్రామం శోకసంద్రంగా మారింది.