పోలీసులకు వాహనాలు అందజేసిన MLA బాలకృష్ణ
సత్యసాయి: హిందూపురం ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే బాలకృష్ణ తన క్యాంప్ కార్యాలయం వద్ద రూ. 50 లక్షల విలువైన 3 బొలెరోలు, 9 ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖకు అందజేశారు. సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో వీటిని సమకూర్చారు.