VIDEO: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

HYD: బహదూర్‌పురాలో ఇవాళ రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బాబాకాంటా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆసీం బిన్ ఇమ్రాన్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.