ఉక్కాయపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

ఉక్కాయపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

కడప నగరంలోని ఉక్కాయపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసి వారి సమస్యలు, క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.