వేసవి సెలవులకు సిద్ధమవుతున్న పర్యటక ప్రాంతాలు

WGL: వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో పర్యటక ప్రాంతాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా పర్యటక ప్రాంతమైన ఖిలా వరంగల్ కోట, పాకాల సరస్సు, భద్రకాళి గుడి వద్ద సందర్శకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖిలావరంగల్లో కాకతీయుల నాటి కట్టడాలు, చిల్డ్రన్ పార్కు, చెరువు, కుష్ మహల్ ఉండగా.. పచ్చని చెట్లమధ్య పాకాల చెరువు ఉంది.