అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. చొరబాటుదారులను రక్షించేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణపై తృణమూల్ ఈసీకి లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఏ పార్టీ పేరును అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. దేశ రక్షణకే కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థ భద్రతకు కూడా చొరబాట్లను ఆపడం అవసరమని పేర్కొన్నారు.