గట్టు గ్రామంలో నీటి సమస్య

గట్టు గ్రామంలో నీటి సమస్య

GDWL: జిల్లాలోని గట్టు మండల కేంద్రంలోని మూడు రోజుల క్రితం కస్తూర్బా స్కూల్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ అవుట్‌లెట్ వాల్ ఫెయిల్ కావడంతో గత మూడు రోజులగా నీటి సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం జరగలేదన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.