ప్రొద్దుటూరులో CMRF చెక్కుల పంపిణీ చేసిన కొండారెడ్డి
KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా 67 మంది లబ్ధిదారులకు రూ.53 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించామన్నారు.