ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ATP: రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా డాక్టర్ల హాజరు పట్టికను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సరైన సమయానికి వైద్యం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇందులో భాగంగా సంబంధిత వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.