తైవాన్ పోటీలకు చైత్రదీపిక ఎంపిక
AKP: నర్సీపట్నంకు చెందిన పెదిరెడ్ల చైత్రదీపిక ఏప్రిల్ 11–20 మధ్య తైవాన్‌లో జరిగే ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్‌లో భారత్ తరఫున పోటీ పడనుంది. ఇటీవల ఆస్ట్రేలియాలోని వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్‌లో మూడు బంగారు పతకాలు సాధించి ప్రతిభ చాటింది. వరుసగా నాలుగోసారి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.