ఈనెల 3, 8, 9వ తేదీల్లో సదరం శిబిరాలు

SRCL: వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం ఈనెల 3, 8, 9వ తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 3న కంటిచూపు, 8న మానసిక, కంటిచూపు, 9న ఎముకలు, వినికిడి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకొని మెడికల్ డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలు తీసుకొని హాజరుకావాలని సూచించారు.