ఐనవోలు జాతర భద్రతపై పోలీస్ అధికారుల పర్యవేక్షణ
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా పార్కింగ్, ఆంగడి స్థలాలను మంగళవారం మామునూరు ఏసీపీ వెంకటేష్ పరిశీలించారు. భక్తులకు, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎస్సై శ్రీనివాస్, సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్, ఉపసర్పంచ్ బరిగల భాస్కర్ ఉన్నారు.