ప్రమాదకరంగా అండర్ పాసేజ్ రోడ్డు

SKLM: పొందూరు మండలంలోని బొడ్డేపల్లి రైల్వే అండర్ పాసేజ్‌లో భారీగా గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో ప్రయాణం కష్టతరంగా మారిందని వారు వాపోతున్నారు. గతంలో వేసిన కాంక్రీట్ సిమెంటు నాణ్యత లేని కారణంగా ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.