రాజీవ్ గాంధీ ఐటీఐలో ఉచిత సోలార్ శిక్షణ
NRML: సూర్యమిత్ర కోర్సులో భాగంగా నిర్మల్లోని రాజీవ్ గాంధీ ఐటీఐలో ఉచిత సోలార్ శిక్షణ అందించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ అమిత్ దేశ్ పాండే ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 90 రోజుల పాటు ఉచిత రెసిడెన్షియల్, శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 25 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐటీఐ లేదా డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులన్నారు.