ఇంటి పట్టాలు, స్థలాలు దరఖాస్తుల ఆహ్వానం

ఇంటి పట్టాలు, స్థలాలు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: పెద్దమండెం మండలంలో అర్హులు ఇంటి పట్టాలు, స్థలాలకు దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ సయ్యద్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 495 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 200 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.