ఘనంగా మొల్ల జయంతి వేడుకలు
CTR: తెలుగు కవయిత్రి అతుకూరి మొల్ల జయంతి సందర్భంగా, జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ కార్యాలయంలోని ఆమె చిత్రపటానికి AR అదనపు ఎస్పీ దేవదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొల్ల రామాయణాన్ని సరళమైన తెలుగులో రచించి, సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో AR DSP మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.