కథ వినగానే నిర్మాణానికి సిద్ధమయ్యా: దుల్కర్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కాంత' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దుల్కర్ మాట్లాడుతూ.. 'కాంత' అనేది ఒక అద్భుతమైన ఫిక్షనల్ స్టోరీ అని, మళ్లీ ఇలాంటి సినిమా రావడం కష్టమన్నాడు. కథలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేమని తెలిపాడు. ఈ కథ వినగానే తను, రానా కలిసి ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను ఎప్పుడూ ముందుంటానని చెప్పాడు.